Add caption ద క్షిణ భారతంలో కూడా రెండో రాజధాని ఏర్పాటు కావాలని, ఏదో ఒక రోజు దక్షిణాది రాజకీయ పార్టీలన్నీ ఒక్కటై తమ గళం వినిపించే రోజు వస్తుందని నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడిన ఆయన దేశంలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని, ఈ మేరకు దక్షిణాది రాజకీయ పార్టీలు ఒక్కటి కావాలన్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్‌ల పెత్తనానికి స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇందుకు ఇదే సరైన సమయమని తెలిపారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో దక్షిణాదిలో కూడా రెండో జాతీయ రాజధాని ఉండాలని పేర్కొన్నారని, ఇప్పటి వరకు అది కలగానే మిగిలిపోయిందన్నారు. ఈ డిమాండును జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తుందన్నారు. 2019 ఎన్నికల్లో ప్రాంతీయ రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని పవన్ అన్నారు. తెలంగాణ నేతలు గత పదేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలను ద్వితీయ శ్రేణి నగరవాసులుగా పరిగణిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల ఆంధ్ర ప్రజలు ఆందోళన, ఆగ్రహానికి గురవ్వుతున్నారని పవన్ అన్నారు. తాను తమిళనాడు వ...